ATM లో డబ్బులు కట్ అయ్యి తిరిగి రాకపోతే ఏలా తిరిగి పొందాలి ? – 2025

ATM లో డబ్బులు కట్ అయ్యి తిరిగి రాకపోతే ఏలా తిరిగి పొందాలి ?

ఈ రోజుల్లో ATM ఉపయోగించే ప్రతి ఒక్కరికీ ఎదురయ్యే సాధారణమైన సమస్య

👉ATM లో డబ్బు కట్ అవుతుంది కానీ చేతికీ క్యాష్ రాదు

ఇలాంటి విషయంలో చాలా మంది భయపడిపోతారు. కానీ నిజానికి ఇది బ్యాంక్ పరిష్కరించుకోవాల్సిన సమస్య.

ఈ ఆర్టికల్లో మీరు తెలుసుకోబోయేది

  • ఏటీఎంలో డబ్బు రాకపోతే ఏం చేయాలి
  • కంప్లీట్ ఎలా ఇవ్వాలి
  • డబ్బు ఎన్నిరోజుల్లో తిరిగి వస్తుంది
  • RBI నిబంధనలు ఏమిటి
ATM లో  డబ్బులు కట్ అయ్యి తిరిగి రాకపోతే ఏలా తిరిగి పొందాలి ?

🔴ATMలో డబ్బు కట్ అయ్యి రాకపోవడానికి కారణాలు

ఎటిఎం లో ట్రాన్స్ యాక్షన్ ఫెయిల్ అవ్వడానికి సాధారణ కారణాలు ఇవి

ఈ కారణాల వల్ల అకౌంట్ నుంచి డబ్బులు డేబీట్ అయినా, ఏటీఎం క్యాష్ మనకి ఇవ్వకపోవచ్చు

subscribe చేసుకోండి మంచి ఉపయోగకరమైన ఇన్ఫర్మేషన్ కోసం

ATM లో డబ్బులు కట్ అయ్యి తిరిగి రాకపోతే ఏలా తిరిగి పొందాలి ?

ATM లో  డబ్బులు కట్ అయ్యి తిరిగి రాకపోతే ఏలా తిరిగి పొందాలి ?
ATM display: “Please wait, transaction in progress”

ATM లో డబ్బులు రాకపోతే వెంటనే చేయాల్సిన పనులు

1. ATM స్లీప్ తీసుకోండి

  • ATM స్లిప్ వస్తే తప్పకుండా తీసుకోండి
  • ఒకవేల స్లిప్ రాకపోయినా భయపడవలసిన అవసరం లేదు

2. బ్యాంక్ కస్టమర్ కేర్‌కి కాల్ చేయండి

మీ డెబిట్ కార్డ్ వెనకాల ఉన్న కస్టమర్ కేర్‌కు నంబర్ కి కాల్ చేసి ఈ వివరాలు చెప్పండి

  • ట్రాన్సాక్షన్ తేదీ
  • సమయం
  • ఎటిఎం లొకేషన్
  • కట్ అయిన అమౌంట్

వారు మీ కంప్లీట్ ను రిజిస్టర్ చేస్తారు

3. బ్యాంక్ బ్రాంచ్ కి వెళ్లి కంప్లీట్ ఇవ్వండి

మీకు దగ్గరలో ఉన్నా బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి

  • ఎటిఎం డిస్ట్రిబ్యూట్ ఫారమ్ తీసుకోండి
  • వివరాలు ఫిల్ చేయండి
  • సబ్మిట్ చేయండి

కావాల్సిన డాక్యుమెంట్స్

  • ఏటీఎం స్లీప్
  • బ్యాంక్ పాస్ బుక్
  • ఆధార్ కార్డ్

4. మొబైల్ బ్యాంకింగ్ /ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వా రా

చాలా బ్యాంకులు ఇప్పుడు

  • ఇంటర్నెట్ బ్యాంకింగ్
  • మొబైల్ యాప్స్

వీటి ద్వారా కూడా ATM కంప్లీట్ చేసే అవకాశం ఉండేది

⏳ATM లో డబ్బులు ఎన్ని రోజులు తిరిగి వస్తుంది

RBI (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ) నిబంధనలు ప్రకారం :

  • 5 నుండి 7 వర్కింగ్ డేస్ లో తిరిగి రావాలి
  • ఆలస్యం అయితే బ్యాంక్ మీకు రోజుకి 100 పెనల్టీ కూడా చెల్లించాలి

ఎక్కువగా మూడు లేదా ఐదు రోజుల్లోనే అమౌంట్ తిరిగి మన ఎకౌంట్ లో క్రెడిట్ అవుతుంది

🏦వేరే బ్యాంక్ ATM ఉపయోగిస్తే ?

మీ బ్యాంక్ కాకుండా వేరే బ్యాంక్ ATM ఉపయోగించినా

మీ సొంత బ్యాంక్ కె కంప్లైంట్ ఇవ్వాలి

ఎటిఎం ఉన్న బ్యాంక్ కి కాదు

❌డబ్బులు తిరిగి రాకపోతే ఏం చేయాలి?

1 ఆర్‌బీఐ కీ కంప్లీట్ చేయండి

బ్యాంక్ స్పందించకపోతే ఆర్‌బిఐ వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు

2. బ్యాంక్ ఓoబుడ్స్ మాన్ కంప్లైంట్

30 రోజులైన పరిష్కారం లేకపోతే బ్యాంకింగ్ ఓoబుడ్స్ మాన్ కీ ఫిర్యాదు చేయండి

  • RBI ఓoబుడ్స్ మాన్ వెబ్సైట్ లో పిర్యాదు చేయవచ్చు
  • ఆన్లైన్ లో కంప్లీట్ చెయ్యవచ్చు
  • ఇది పూర్తిగా ఫ్రీ

బ్యాంక్ తప్పు ఉంటే తప్పకుండా పరిష్కారం వస్తుంది

🔐భవిష్యత్తులో ATM సమస్యల నుంచి జాగ్రత్తలు

  • రంద్ధి ఎక్కువగా ఉన్న atm ల లో విత్ డ్రా చేయండి
  • ట్రాన్సాక్షన్ సమయంలో తొందరపడవద్దు
  • బ్యాంక్ sms అలర్ట్ ఆన్ లో ఉంచండి
  • atm దగ్గరే కొంతసేపు వేచి ఉండండి

❓తరచూ అడిగే ప్రశ్నలు(ఫాక్)

Q1 : ATM లో డబ్బులు రాకపోయినా కట్ అయ్యాయి ,వస్తాయా?

👉అవును ,తప్పకుండా వస్తాయి.

Q2: ఎన్ని రోజుల్లో డబ్బులు వస్తాయి?

👉సాధారణంగా మూడు ఏడు వర్కింగ్ డేస్

Q3: ATM వేరే బ్యాంక్ అయితే కూడా వస్తాయా?

👉అవును , వస్తాయి ఎలాంటి ఏమైనా రూల్స్ ఒక్కటే

Q4: డబ్బు తిరిగి రావడానికి ఛార్జీలు ఉంటాయ?

👉లేదు ఇది పూర్తిగా హూ చిత్రం ఉచితo

Q5: ATM స్లీప్ లేకపోయినా డబ్బులు వస్తాయా?

👉అవును,వస్తాయి ట్రాన్స్ యాక్షన్ వివరాలు ఉంటే చాలు

🔚 ముగింపు

ఏటీఎంలో డబ్బులు కట్ అయ్యి రాకపోతే భయపడవలసిన అవసరం లేదు సరైన విధంగా బ్యాంక్ కు కంప్లీట్ ఇస్తే నీ డబ్బులు తిరిగి తప్పకుండా తిరిగి వస్తాయి

👉ఈ సమాచారం మీకు ఉపయోగపడితే ఇతరులతో షేర్ చేయండి

👉ఇలాంటి మరిన్ని బ్యాంక్ మరియు ATM టిప్ కోసం మా వెబ్సైట్ నీ ఫాలో అవ్వండి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *