ATM లో డబ్బులు కట్ అయ్యి తిరిగి రాకపోతే ఏలా తిరిగి పొందాలి ?
ఈ రోజుల్లో ATM ఉపయోగించే ప్రతి ఒక్కరికీ ఎదురయ్యే సాధారణమైన సమస్య
👉ATM లో డబ్బు కట్ అవుతుంది కానీ చేతికీ క్యాష్ రాదు
ఇలాంటి విషయంలో చాలా మంది భయపడిపోతారు. కానీ నిజానికి ఇది బ్యాంక్ పరిష్కరించుకోవాల్సిన సమస్య.
ఈ ఆర్టికల్‌లో మీరు తెలుసుకోబోయేది
- ఏటీఎంలో డబ్బు రాకపోతే ఏం చేయాలి
- కంప్లీట్ ఎలా ఇవ్వాలి
- డబ్బు ఎన్నిరోజుల్లో తిరిగి వస్తుంది
- RBI నిబంధనలు ఏమిటి

🔴ATMలో డబ్బు కట్ అయ్యి రాకపోవడానికి కారణాలు
ఎటిఎం లో ట్రాన్స్ యాక్షన్ ఫెయిల్ అవ్వడానికి సాధారణ కారణాలు ఇవి
- నెట్వర్క్ లేదా సర్వర్ సమస్య
- ఏటీఎంలో డబ్బులు లేకపోవడం
- పవర్ కట్
- స్లో ఇంటర్నెట్ కనెక్షన్
- టెక్నికల్ ఎర్రర్
ఈ కారణాల వల్ల అకౌంట్ నుంచి డబ్బులు డేబీట్ అయినా, ఏటీఎం క్యాష్ మనకి ఇవ్వకపోవచ్చు
subscribe చేసుకోండి మంచి ఉపయోగకరమైన ఇన్ఫర్మేషన్ కోసం
ATM లో డబ్బులు కట్ అయ్యి తిరిగి రాకపోతే ఏలా తిరిగి పొందాలి ?

✅ATM లో డబ్బులు రాకపోతే వెంటనే చేయాల్సిన పనులు
1. ATM స్లీప్ తీసుకోండి
- ATM స్లిప్ వస్తే తప్పకుండా తీసుకోండి
- ఒకవేల స్లిప్ రాకపోయినా భయపడవలసిన అవసరం లేదు
2. బ్యాంక్ కస్టమర్ కేర్‌కి కాల్ చేయండి
మీ డెబిట్ కార్డ్ వెనకాల ఉన్న కస్టమర్ కేర్‌కు నంబర్ కి కాల్ చేసి ఈ వివరాలు చెప్పండి
- ట్రాన్సాక్షన్ తేదీ
- సమయం
- ఎటిఎం లొకేషన్
- కట్ అయిన అమౌంట్
వారు మీ కంప్లీట్ ను రిజిస్టర్ చేస్తారు
3. బ్యాంక్ బ్రాంచ్ కి వెళ్లి కంప్లీట్ ఇవ్వండి
మీకు దగ్గరలో ఉన్నా బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి
- ఎటిఎం డిస్ట్రిబ్యూట్ ఫారమ్ తీసుకోండి
- వివరాలు ఫిల్ చేయండి
- సబ్మిట్ చేయండి
కావాల్సిన డాక్యుమెంట్స్
- ఏటీఎం స్లీప్
- బ్యాంక్ పాస్ బుక్
- ఆధార్ కార్డ్
4. మొబైల్ బ్యాంకింగ్ /ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వా రా
చాలా బ్యాంకులు ఇప్పుడు
- ఇంటర్నెట్ బ్యాంకింగ్
- మొబైల్ యాప్స్
వీటి ద్వారా కూడా ATM కంప్లీట్ చేసే అవకాశం ఉండేది
⏳ATM లో డబ్బులు ఎన్ని రోజులు తిరిగి వస్తుంది
RBI (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ) నిబంధనలు ప్రకారం :
- 5 నుండి 7 వర్కింగ్ డేస్ లో తిరిగి రావాలి
- ఆలస్యం అయితే బ్యాంక్ మీకు రోజుకి 100 పెనల్టీ కూడా చెల్లించాలి
ఎక్కువగా మూడు లేదా ఐదు రోజుల్లోనే అమౌంట్ తిరిగి మన ఎకౌంట్ లో క్రెడిట్ అవుతుంది
🏦వేరే బ్యాంక్ ATM ఉపయోగిస్తే ?
మీ బ్యాంక్ కాకుండా వేరే బ్యాంక్ ATM ఉపయోగించినా
మీ సొంత బ్యాంక్ కె కంప్లైంట్ ఇవ్వాలి
ఎటిఎం ఉన్న బ్యాంక్ కి కాదు
❌డబ్బులు తిరిగి రాకపోతే ఏం చేయాలి?
1 ఆర్బీఐ కీ కంప్లీట్ చేయండి
బ్యాంక్ స్పందించకపోతే ఆర్బిఐ వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు
2. బ్యాంక్ ఓoబుడ్స్ మాన్ కంప్లైంట్
30 రోజులైన పరిష్కారం లేకపోతే బ్యాంకింగ్ ఓoబుడ్స్ మాన్ కీ ఫిర్యాదు చేయండి
- RBI ఓoబుడ్స్ మాన్ వెబ్సైట్ లో పిర్యాదు చేయవచ్చు
- ఆన్లైన్ లో కంప్లీట్ చెయ్యవచ్చు
- ఇది పూర్తిగా ఫ్రీ
బ్యాంక్ తప్పు ఉంటే తప్పకుండా పరిష్కారం వస్తుంది
🔐భవిష్యత్తులో ATM సమస్యల నుంచి జాగ్రత్తలు
- రంద్ధి ఎక్కువగా ఉన్న atm ల లో విత్ డ్రా చేయండి
- ట్రాన్సాక్షన్ సమయంలో తొందరపడవద్దు
- బ్యాంక్ sms అలర్ట్ ఆన్ లో ఉంచండి
- atm దగ్గరే కొంతసేపు వేచి ఉండండి
❓తరచూ అడిగే ప్రశ్నలు(ఫాక్)
Q1 : ATM లో డబ్బులు రాకపోయినా కట్ అయ్యాయి ,వస్తాయా?
👉అవును ,తప్పకుండా వస్తాయి.
Q2: ఎన్ని రోజుల్లో డబ్బులు వస్తాయి?
👉సాధారణంగా మూడు ఏడు వర్కింగ్ డేస్
Q3: ATM వేరే బ్యాంక్ అయితే కూడా వస్తాయా?
👉అవును , వస్తాయి ఎలాంటి ఏమైనా రూల్స్ ఒక్కటే
Q4: డబ్బు తిరిగి రావడానికి ఛార్జీలు ఉంటాయ?
👉లేదు ఇది పూర్తిగా హూ చిత్రం ఉచితo
Q5: ATM స్లీప్ లేకపోయినా డబ్బులు వస్తాయా?
👉అవును,వస్తాయి ట్రాన్స్ యాక్షన్ వివరాలు ఉంటే చాలు
🔚 ముగింపు
ఏటీఎంలో డబ్బులు కట్ అయ్యి రాకపోతే భయపడవలసిన అవసరం లేదు సరైన విధంగా బ్యాంక్ కు కంప్లీట్ ఇస్తే నీ డబ్బులు తిరిగి తప్పకుండా తిరిగి వస్తాయి
👉ఈ సమాచారం మీకు ఉపయోగపడితే ఇతరులతో షేర్ చేయండి
👉ఇలాంటి మరిన్ని బ్యాంక్ మరియు ATM టిప్ కోసం మా వెబ్సైట్ నీ ఫాలో అవ్వండి

