చలికాలంలో ఇమ్యూనిటీని పెంచే ఆహారాలు – 2026

పరిచయం:

చలికాలంలో ఇమ్యూనిటీని పెంచే ఆహారాలు – చలికాలం వచ్చిందంటే జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ కాలంలో మన శరీరానికి ఇమ్యూనిటీ (రోగనిరోధక శక్తి) బలంగా ఉండాలి. మంచి ఆహారం తీసుకుంటే శరీరం వ్యాధులతో పోరాడగలుగుతుంది. అందుకే చలికాలంలో ఇమ్యూనిటీని పెంచే ఆహారాలను రోజువారి డైట్ లో చేర్చుకోవడం చాలా అవసరం.

subscribeచేసుకోండి మంచి ఉపయోగకరమైన ఇన్ఫర్మేషన్ కోసం

చలికాలంలో ఇమ్యూనిటీని పెంచే ఆహారాలు

చలికాలంలో ఇమ్యూనిటీని పెంచే ఆహారాలు
  • అల్లం

అల్లం చలికాలంలో చాలా ఉపయోగపడే ఔషధ గుణాలున్న ఆహారం.

అల్లం లో ఉన్న యాంటీ – ఇన్‌ఫ్లమేటరీ గుణాలు జలుబు, గొంతు నొప్పి తగ్గించడంలో సహాయపడతాయి.

అల్లం టీ తాగడం లేదా వంటల్లో వాడడం మంచిది.

  • వెల్లుల్లి

వెల్లుల్లిలో యాంటీబ్యాక్టిరియల్, యాంటివైరల్ లక్షణాలు ఉంటాయి.

ఇది శరీరంలో ఇన్ఫెక్షన్లను దూరం చేస్తాయి.

రోజూ ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బలు తినడం ఇమ్యూనిటీనిపెంచుతోంది.

  • తులసి

తులసి ఆకులు ఆయుర్వేదంలో ముఖ్యమైన ఔషదం.

ఇది జలుబు, దగ్గు, జ్వరానికి మంచి మందు.

తులసి ఆకులతో కషాయం చేసేందుకు తాగితే మంచి ఫలితం ఉంటుంది.

  • నిమ్మకాయ

నిమ్మకాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది.

ఇది శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగడం మంచిది.

  • తేనె

తేనే సహజమైన ఎనర్జీ బూస్టర్.

ఇది గొంతు నొప్పి తగ్గించి శరీరానికి శక్తినిస్తుంది.

ఉదయం ఖాళీ కడుపుతో తేనే తీసుకోవడం మంచిది.

  • పసుపు

పసుపులో కర్కుమిన్ అనే పదార్థం ఉంటుంది.

ఇది శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతోంది.

పసుపు పాలు తాగడం చలికాలంలో చాలా ఉపయోగకరం.

  • డ్రై ఫ్రూట్స్

బాదం , జీడిపప్పు , వాల్ నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ లో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.

రోజు కొద్దిగా డ్రైఫ్రూట్స్ తీసుకుంటే శరీరం బలంగా ఉంటుంది.

ఆకుకూరలు

పాలకూర, మెంతికూర, కొత్తిమీర వంటి ఆకుకూరలు విటమిన్లు, మినరల్స్ తో నిండి ఉంటాయి.

ఆకుకూరలు ఎక్కువగా తినాలి.

  • గుడ్లు

గుడ్లలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది.

ఇది శరీర కణాలను బలపర్చి వ్యాధులను ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది.

  • గోరువెచ్చని నీరు

చల్లని నీటిచే బదులు గోరువెచ్చని నీరు తాగాలి.

ఇది శరీరంలో టాక్సిన్స్ తొలగించడంలో సహాయపడుతుంది.

  • సూప్ లు (soup )

చలికాలంలో వేడి సూపులు శరీరానికి చాలా మంచిది .

కూరగాయల సూప్ , చికెన్ సూప్, పప్పుల సూప్ తీసుకోవడం వల్ల శరీరం వేడిగా ఉండడంతో పాటు ఇమ్యూనిటి కూడా పెరుగుతుంది.

ముఖ్యంగా గొంతు నొప్పి, జలుబు ఉన్నప్పుడు సూప్ లు చాలా ఉపయోగం .

  • పెరుగు

పెరుగు లో ఉన్న మంచి బ్యాక్టీరియా (ప్రోబయోటిక్స్ ) జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి.

జీర్ణశక్తి బలంగా ఉంటే ఇమ్యూనిటీ కూడా బలంగా ఉంటుంది.

చలికాలంలో చల్లని పెరుగు కాకుండా గది ఉష్ణోగ్రతలో తీసుకోవాలి.

  • మష్రూమ్

మష్రూమ్స్‌లో విటమిన్ డి , యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి.

ఇవి శరీరానికి వ్యాధులను ఎదుర్కొనే శక్తినిస్తాయి.

కూరల్లో లేదా సూప్ లలో మష్రూమ్స్ చేర్చుకోవచ్చు.

  • మునగ ఆకులు

మునగ ఆకులు పోషకాల గని లాంటివి.

ఇవి రక్తాన్ని శుద్ధి చేసి శరీరానికి బలాన్నిస్తాయి.

మునగ ఆకులతో కూర లేదా సూప్ చేసుకుని తినాలి.

  • సిట్రస్ పండ్లు

నారింజ, మోసాంబి, చక్రపండు వంటి పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది.

రోజూ ఒక పండు తినడం ఇమ్యూనిటీని పెంచుతోంది.

  • గ్రీన్ టీ

గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి.

రోజుకు ఒకటి లేదా రెండు కప్పుల గ్రీన్ టీ తాగితే మంచిది.

  • బెల్లం

బెల్లం సహజమైన తీపి పదార్థం.

ఇది శరీరాన్ని శుభ్రపరచి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

చలికాలంలో చిన్న ముక్క బెల్లం తినడం మంచిది.

  • మాసాలాలు

దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు వంటి మసాలాలు శరీరాన్ని వేడిగా ఉంచుతాయి.

వంటల్లో వీటిని వాడటం వల్ల జలుబు తగ్గుతుంది.

  • చేపలు

చేపల్లో ఒమేగా-3 ఫ్యాంటి యాసిడ్స్ ఉంటాయి

ఇవి శరీరానికి బలం ఇచ్చే ఇమ్యూనిటీని పెంచుతాయి

వారానికి రెండుసార్లు చేపలు తినడం మంచిది

  • పప్పుధాన్యాలు

పెసలు పప్పు, కందిపప్పు, శనగపప్పు వంటి పప్పులో ప్రొటీన్లు ఉంటాయి.

ఇవి శరీరానికి బలాన్ని ఇస్తాయి

చలికాలంలో పాటించాల్సిన సూచనలు

  • ఎక్కువగా వేడి ఆహారం తినాలి
  • చల్లని పానీయాలు దూరంగా పెట్టాలి.
  • సరైనా నిద్ర తీసుకోవాలి.
  • రోజు కొంత వ్యాయామం చేయాలి.

చలికాలంలో తినకూడని ఆహారాలు

  • రోజు ఫ్రిజ్ లో పేటిన ఆహారాన్ని తినకూడదు
  • సాఫ్ట్ డ్రింక్స్
  • ఎక్కువగా ఫ్రై చేసిన పదార్థాలు
  • బయట స్వీట్ ఫుడ్
  • ఇమ్యూనిటీని పెంచే డైట్ చాట్
చలికాలంలో ఇమ్యూనిటీని పెంచే ఆహారాలు

ఉదయం: గోరువెచ్చని నీరు+ తేనే

టిఫిన్: ఇడ్లీ/ ఉప్మ +కూర

మధ్యాహ్నం: అన్నం/ పప్పు +కూర

సాయంత్రం: గ్రీన్ టీ/ సూప్

రాత్రి: తేలికపాటి భోజనం

చలికాలంలో ఇమ్మునిటీని తగ్గడానికి కారణాలలు

చలికాలంలో చాలామందిలో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది.

దానికి ప్రధాన కారణాలు టీవీ:

  • ఎండ తక్కువగా ఉండటం వల్ల విటమిన్ డి లోపం
  • చల్లని వాతావరణం వల్ల వ్యాయామం తగ్గడం
  • చల్లని నీరు చల్లని ఆహారం ఎక్కువగా తీసుకోవడం
  • సరైన నిద్ర లేకపోవడం

ఇవే శరీర రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తాయి

పిల్లల కోసం చలికాలంలో ఇమ్యూనిటీని పెంచే ఆహారాలు

పిల్లలకూ చలికాలంలో ఎక్కువగా జలుబు దగ్గు వస్తుంటాయి అందుకే వీటిపై ప్రత్యేక శ్రద్ధ అవసరం

  • పసుపు పాలు
  • గుడ్లు
  • కూరగాయల సూప్
  • పండ్లు నారింజ , ఆపిల్
  • బెల్లం+పల్లిలో

ఇవి పిల్లల్లో ఇమ్యూనిటీని సహజంగా పెంచుతాయి

వృద్ధుల కోసం ఇమ్యునిటీ టిప్స్

  • వేడి ఆహారం మాత్రమే తీసుకోవాలి
  • రోజు గోరువెచ్చని నీరు త్రాగాలి
  • తేలికపాటి వ్యాయామం చేయాలి
  • పసుపు అల్లం వంటల్లో తప్పనిసరిగా వాడాలి

చలికాలంలో హోమ్ రెమెడీస్

చలికాలంలో మందుల కంటే ఇంటి చిట్కాలు చాలా మంచివి

  • అల్లం + తేనె మిశ్రమం
  • తులసి కషాయం
  • పసుపు పాలు
  • మిరియాలు + బెల్లం

ఇవి ఇమ్యూనిటీని పెంచడంతో పాటు జలుబు తగ్గిస్తాయి.

చలికాలంలోజీవనశైలి మార్పులు

ఆహారంతో పాటు జీవనశైలి కూడా చాలా ముఖ్యం.

  • ఉదయం ఎండలో 15 నిమిషాలు నిలబడాలి.
  • రోజు కనీసం ఏడెనిమిది గంటలు నిద్ర
  • మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి
  • పొగ తాగడం మద్యం దూరంగా పెట్టాలి

తరచూ అడిగే ప్రశ్నలు

Q) చలికాలంలో రోజు పసుపు పాలు తాగవచ్చా?

ans : అవును రోజు తాగవచ్చు ఇది ఇమ్యూనిటీని పెంచుతోంది

Q) పిల్ల లకు గ్రీన్ టీ ఇవ్వవచ్చా?

ans : పిల్లలకి గ్రీన్ టీ ఇవ్వకపోవడం మంచిది.

Q) చల్లని నీరు తాగితే ఏమవుతుంది?

ans : జలుబు గొంతునొప్పి వచ్చే అవకాశం ఎక్కువ.

ముగింపు

చలికాలంలో ఇమ్మునిటీని బలంగా ఉండే ఉంటేనే ఆరోగ్యంగా ఉండగలుగుతాం. చలికాలంలో ఇమ్యూనిటీని పెంచే ఆహారాలను రోజూ తీసుకుంటే జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి సరైన ఆహారంతో శరీరాన్ని కాపాడు కుందాం.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *